కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్త తిరగబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఇనుగుర్తి మండల కేంద్రంలో జరిగిన ప్రజా పాలన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే మురళి నాయక్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత విరుచుకు పడ్డాడు.
పార్టీ కోసం పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో నెల్లికుదురు మండలంలో ఎమ్మెల్యే మురళి నాయక్‌ను అడ్డుకుని నీ అంతు చూస్తా అని కాంగ్రెస్ ముఖ్య నేతలు హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో ఎమ్మెల్యే మురళి నాయక్ ఒక్కసారిగా బిత్తరపోయాడు.తమను పార్టీలో ఎదగనివ్వడం లేదని, తగిన అవకాశాలు కల్పించడం లేదని ఎమ్మెల్యే మీద సీనియర్ కాంగ్రెస్ నేత సీరియస్ అయినట్లు సమాచారం.
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తిరగబడ్డ సొంత పార్టీ కార్యకర్త
మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్‌కి సొంత పార్టీ నేతల నిరసన సెగ
ఇనుగుర్తి మండల కేంద్రంలో జరిగిన ప్రజా పాలన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే మురళి నాయక్‌పై విరుచుకు పడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత
పార్టీ కోసం పని చేసే వారికి ప్రాధాన్యత… pic.twitter.com/VQ4rUdDkkS
— Telugu Scribe (@TeluguScribe) December 5, 2024