Golriz Gahraman: బట్టలు కొట్టేసిందని ఆరోపణలు.. భరించలేక రాజీనామా చేసిన న్యూజిలాండ్‌ ఎంపీ

-

చిన్నతనంలోనే శరణార్థిగా గోల్రిజ్ గహ్రమాన్‌ న్యూజిలాండ్‌కు వలస వచ్చారు. న్యూజిలాండ్ లో న్యాయశాస్త్రం అభ్యసించిన ఆమె ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత గ్రీన్‌పార్టీ తరఫున 2017లో న్యూజిలాండ్‌ పార్లమెంటులోకి అడుగుపెట్టి మొట్టమొదటి శరణార్థిగా చరిత్ర సృష్టించారు. కానీ ఆక్లాండ్‌, వెల్లింగ్టన్‌ ప్రాంతాల్లోని పలు హై ఎండ్‌ క్లాతింగ్‌ స్టోర్స్‌లో గోల్రిజ్‌ బట్టల దొంగతనానికి ప్రయత్నించిన సీసీ టీవీ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఆరోపణలతో గోల్రిజ్‌ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

 

దొంగతనం ఆరోపణలపై గోల్రిజ్‌ గహ్రమాన్‌ స్పందిస్తూ …పని ఒత్తిడి కారణంగా తన మానసిక ఆరోగ్యం దారుణంగా దెబ్బతిన్నదని ,దీని కారణంగా తన వ్యక్తిత్వానికి భిన్నంగా తన చేష్టల్లో మార్పు వచ్చిందని ఆమె తెలిపారు. తనను చట్టసభలకు పంపించి ప్రజలు తనపై పెట్టుకున్న అంచనాలు అందుకోలేక వాళ్లందరినీ నిరాశకు గురి చేసినందుకు క్షమాపణలు తెలియజేశారు. తన మానసిక ఆరోగ్యం రికవరీ కావాలంటే రాజీనామా చేయడమే సరైనదని భావిస్తున్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news