కరీంనగర్ టౌన్ : ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కి ముఖ్యమంత్రి పదవి పై కన్ను పడిందని… CM ని కలవాలంటే సంతోష్ కుమార్ కనుసన్నల్లోనే నడుస్తుందని విమర్శలు చేశారు. సంతోష్ కుమార్ తో సహా కుటుంబ సభ్యులు వేల కోట్లు ఆర్జించారని… అమాయకుల పై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఇంటలిజెన్స్ సమాచారం కూడా సీఎంకు సంతోష్ కుమార్ ద్వారానే వెళ్తుందని…. తక్షణమే అక్రమ దందాలు ఆపాలని దళితుల పై కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాబోయే భవిష్యత్తులో సంతోష్ కుమార్ కు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ కు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నానని… తప్పకుండా ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమన్నారు. 50 లక్షల మందికి నేరుగా ప్రెస్ మీట్ ద్వారా సమాచారం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని… తన భవిష్యత్తులో గాని గతంలో గాని ఎలాంటి సీక్రెట్స్ ఉండవని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.