ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. Project-K అప్‌డేట్ ఇచ్చేసిన ప్రొడ్యూసర్..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన గత చిత్రం ‘రాధేశ్యామ్’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో తర్వాత వచ్చే సినిమాలు డెఫినెట్ గా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తాయని ప్రభాస్ అభిమానులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటిస్తున్న ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ Project-K గురించి కీలక అప్ డేట్ ఇచ్చేశారు ప్రొడ్యూసర్ అశ్వనీదత్.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న Project-K షూటింగ్ 55 పర్సెంట్ పూర్తయిందని తెలిపారు. మిగతా భాగం షూట్ జరగాల్సిందని, కానీ, కొన్ని కారణాల వలన ఆగిపోయిందని పేర్కొన్నారు.

ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితా బ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానీ నటిస్తున్న సంగతి అందరికీ విదితమే. ప్రభాస్ ఈ చిత్రంలో వెరీ డిఫరెంట్ అవతార్ లో కనిపించనున్నారు.

ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ కంప్లీట్ అయిందన్న విషయం తెలుసుకుని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది కల్లా ఈ పిక్చర్ షూట్ పూర్తయ్యే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ చిత్రాల షూటింగ్స్ లో ప్యారలల్ గా పాల్గొంటున్నారు. ఈ రెండిటి తర్వాత ప్రభాస్ ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ పిక్చర్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version