ఎంత సుఖమిదీ మనోహరా: అచ్చెన్న అదృష్టం అలా ఉంది!

-

ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న “అమరావతి – మూడు ప్రాంతాలు” టాపిక్ లో అమారవతి ప్రాంతంలోని కొందరు బాగుంటే చాలు, ఆర్ధికంగా బలపడితే చాలని బాబు భావిస్తుంటే… అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న టీడీపీ నేతలు సైలంట్ గా ఉంటూ.. మీడియాకు ముఖం చాటేసి తిరుగుతుంటే… సీమకే రాజధాని కావాలని సీమ టీడీపీ నేతలు కొత్త స్వరాలందుకున్నారు! ఈ పరిస్థితుల్లో అచ్చెన్నా బయట ఉంటే!

టీడీపీ తరుపున ప్రస్తుతం అసెంబ్లీలో బలమైన వాయిస్ అచ్చెన్నాయుడు అనేది టీడీపీ నేతలే చెబుతున్న మాట. చంద్రబాబు ఫీలవుతారని కూడా అలోచించకుండా.. లోకేష్ వంటివారే అచ్చెన్నాను బాహుబలితో పోల్చారు. మరి బాబెవరు… బిజ్జాలదేవా? ఆ సంగతి కాసేపు పక్కనపెడితే… అలాంటి అచ్చెన్నాయుడు ఈ సమయంలో బయట ఉండి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవనేవారు కొందరైతే… ఉండకపోవడం వ్యక్తిగతంగా ప్లస్ అని మరికొందరు అంటున్నారు!

అవును… ఈ సమయంలో అచ్చెన్నా బయట ఉంటే… కచ్చితంగా మూడు రాజధానుల విషయంలో అచ్చెన్న తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాల్సిన పరిష్తితి. బాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకునే క్రమంలో రాజినామాలు కూడా చేయాల్సిన పరిషితి! ఈ సమయంలో అచ్చెన్న బయట ఉంటే… ఇటు తన సొంత ప్రాంతమైన ఉత్తరాంధ్రను కాదనాలా… తన పార్టీ ఆర్ధిక పరిపుష్టికి సహకరిస్తోందనే కామెంట్లు పడుతున్న అమరావతిని అవుననాలా? రెండూ కష్టమే!

బాబుని కాదని ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలని చెప్పే ధైర్యం అచ్చెన్నకు ఉండకపోవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలను కాదని అమరావతికే తన మద్దతు అని చెప్పే సాహసం చేయలేకపోవచ్చు! మధ్యలో అచ్చెన్నాకు మామూలు వాయింపు ఉండేది కాదు! కాబట్టి… శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉన్న అచ్చెన్నాయుడికి ఈ తాజా రాజకీయ పరిస్థితులు గుడ్డిలో మెల్లలా మారాయనే చెప్పాలి! దీంతో… అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నను అదృష్టంవంతుడు అంటున్నారు ఆయన అభిమానులు!

Read more RELATED
Recommended to you

Exit mobile version