మీరు ఎల్ఐసీ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా. అయితే ఏ ప్లాన్ ఎంచుకోవాలో అర్ధం కావడంలేదా. అయితే ఇది మీకోసమే. దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎన్నో రకాల పాలసీలు అందిస్తోందని నిపుణులు తెలిపారు. అయితే ఎల్ఐసీలో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదని తెలియజేశారు. ఇక కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుందని అన్నారు. అంతేకాదు అందుకే ప్రజల్లో ఎల్‌ఐసీపై విశ్వాసం ఎక్కువ అని అన్నారు. అయితే ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల చాలా భవిష్యత్‌లో ప్రయోజనం పొందొచ్చునని కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుందని తెలిపారు.
అంతేకాదు ఎల్‌ఐసీలో పలు రకాల పాలసీ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే వీటిల్లో ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒక భాగంగానే చెప్పుకోవచ్చునని అన్నారు. ఇక ఈ పాలసీ తీసుకోవడం వల్ల రోజుకు రూ.70 ఆదా చేయడంతో చేతికి ఏకంగా రూ.50 లక్షలు పొందొచ్చునన్నారు. అయితే ఈ పాలసీకి కనీసం 18 ఏళ్లు వయసు కలిగిన వారు ఈ ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవచ్చునని తెలిపారు. అంతేకాదు గరిష్టంగా 35 ఏళ్ల వరకు పాలసీ ప్రీమియం చెల్లించొచ్చునన్నారు.
ఇక కనీసం రూ.లక్ష మొత్తానికి పాలసీ తీసుకోవాలని తెలిపారు. దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదన్నారు. ఇక రిస్క్ కవర్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. పాలసీ మెచ్యూరిటీ సమయంలో మీ డబ్బులతోపాటు బోనస్, ఇంకా ఇతర ప్రయోజనాలు లభిస్తాయని తెలియజేశారు. ఇది ఎండోమెంట్ పాలసీ. అందువల్ల ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.
అయితే ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల మెచ్యూరిటీ సమయంలో రూ.50 లక్షలు ఎలా పొందొచ్చొ చూద్దామా. దీని కోసం మీరు రోజుకు రూ.70 ఆదా చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదాహరణకు మీకు 18 ఏళ్ల వయసు ఉంది. రూ.10 లక్షలకు 35 ఏళ్ల కాల పరిమితితో ఈ పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు మీ వార్షిక ప్రీమియం దాదాపు రూ.26,000 అవుతుందని తెలిపారు.