అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువులకు వందనం.. హ్యాప్పీ టీచర్స్ డే..!

-

పురాణ కాలం నుంచి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో గురువుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ.. అన్న తరువాత ఆచార్య దేవోభవ.. అని పలుకుతూ గురువులకు ప్రాధాన్యతను ఇవ్వడం అనాదిగా వస్తోంది.

పురాణ కాలం నుంచి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో గురువుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ.. అన్న తరువాత ఆచార్య దేవోభవ.. అని పలుకుతూ గురువులకు ప్రాధాన్యతను ఇవ్వడం అనాదిగా వస్తోంది. ఎందుకంటే గురువు.. మనలోని అజ్ఞానాన్ని పారదోలి వెలుగు ఇస్తాడు కనుక.. గురువుకు పురాణ కాలం నుంచి ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఇక మనకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు మాత్రమే గురువులు కాదు, మనకు ఏ విషయాన్ని ఎవరు నేర్పినా వారిని కూడా మనం గురువులు అనాల్సిందే.

గు అంటే చీకటి అని.. రు అంటే తొలగించు అని అర్థం వస్తుంది. అంటే.. అజ్ఞానమనే చీకటిని గురువు తొలగిస్తాడన్నమాట. మనకు విద్యాబుద్ధులతోపాటు చక్కని నడవడిక, ప్రవర్తన, క్రమశిక్షణను గురువు నేర్పిస్తాడు. అందుకే మనం జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాం. అయితే ఒకప్పుడు గురుకులానికి వెళ్లి విద్య నేర్చుకున్నట్లుగా ఇప్పుడు విద్యావిధానం లేదు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి చదువు కొనుక్కుని విద్య నేర్చుకుంటున్నారు. అలాగే విద్యార్థులకు పాఠాలు బాగా చెప్పి వారితో కలిసిపోయే ఉపాధ్యాయులు నేడు కనిపించడం లేదు. ఉత్తమ ఉపాధ్యాయులు ఇప్పుడు మనకు కనిపించడమే కష్టతరమవుతోంది. అయినప్పటికీ విద్యార్థులకు విద్య నేర్పే గురువులంటే దైవంతో సమానమే.

పిల్లలకు పాఠాలు నేర్పే బడిపంతులు అని ఒకప్పుడు ఉపాధ్యాయులను ఎగతాళి చేసే వారు. కానీ ఇప్పుడదే వృత్తి ఎంతో గౌరవప్రదమైందిగా మారింది. ఎంత ధనవంతులు, గొప్పవారైనా సరే.. గురువులకు నమస్కరించాల్సిందే. మనకు చిన్నప్పుడు విద్యాబుద్ధులు చెప్పి మనల్ని ఉన్నత స్థాయికి చేర్చిన మన గురువులను మనం కచ్చితంగా స్మరించుకోవాల్సిందే. మనల్ని ఈ స్థానంలో నిలిపిన గురువులకు కృతజ్ఞతలు తెలపాల్సిందే. అందుకనే ప్రతి ఏటా మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సారి కూడా మనం మన గురువుల్ని, వారు మనకు చేసిన సేవలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.. హ్యాప్పీ టీచర్స్ డే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version