సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వెళ్లి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అయ్యే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుగు ప్రయాణంలో ప్యాసింజర్స్ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
జనవరి 18 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 18న కాకినాడ నుంచి ఒకటి, విశాఖపట్నం నుంచి రెండు ట్రైన్లు నూతనంగా ప్రారంభించబడిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు వెళ్తాయ. 19న నరసాపురం, వైజాగ్ నుంచి రెండు రైళ్లు చర్లపల్లికి రానున్నాయి. అదే రోజు చర్లపల్లి నుంచి వైజాగ్ ఒకటి, భువనేశ్వర్‌కు ఒకటి చొప్పున రెండు స్పెషల్ ట్రైన్లు రానున్నాయి.ఈ నెల 20న చర్లపల్లి నుంచి వైజాగ్‌కు మరో స్పెషల్ ట్రైన్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ శ్రీధర్ తెలిపారు.