త్వరలోనే తెలంగాణలో టీడీపీ రీ- ఎంట్రీ – నారా లోకేష్‌

-

త్వరలోనే తెలంగాణలో టీడీపీ రీ- ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు ఏపీ మంత్రి నారా లోకేష్‌. ఇవాళ సీనియర్‌ ఎన్టీఆర్‌ 29 వర్ధంతి. ఈ తరుణంలోనే… ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్….ఆయనకు నివాళులు అర్పించారు. ఇటు నారా లోకేష్‌ కుటుంబం కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.

AP Minister Nara Lokesh has announced that TDP is going to re-enter Telangana

నందమూరి తారక రామారావు వల్లే ఈరోజు తెలుగు వాళ్లు తలెత్తుకొని తిరుగుతున్నారని గుర్తు చేశారు నారా లోకేష్. ఎన్టీఆర్ అంటే కేవలం మూడక్షరాల పేరు కాదు, ఎన్టీఆర్ అంటే ప్రభంజనం అన్నారు. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో ఆయన నెంబర్ వన్ గా నిలిచారని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక గొప్ప సంస్కరణలు తెచ్చారన్నారు మంత్రి నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news