ఎన్టీఆర్ కోసం ప్రత్యేక వంటకాలు తెచ్చిన లక్ష్మీపార్వతి !

-

ఎన్టీఆర్ కోసం ప్రత్యేక వంటకాలు తెచ్చారు లక్ష్మీ పార్వతి. ఇంట్లో ప్రత్యేకంగా వండిన వంటాకాలు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద పెట్టారు లక్ష్మీ పార్వతి. సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి….అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నానంటూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మి పార్వతి హాట్ కామెంట్స్ చేశారు.

laxmi parvathi

నా భర్త ఎలా చనిపోయారో, ఎన్ని కుతంత్రాలు జరిగాయో నాకు తెలుసు అన్నారు. ఇప్పటికీ ఆ దుర్మార్గుల అరాచకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయని ఆగ్రహించారు. నేను చేసిన తప్పు ఏంటో ఇప్పటికీ నాకు తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. అందరి సమక్షంలోనే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఏ రోజు ఏ పదవి ఆశించకుండా నిస్వార్ధంగా పని చేశానని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news