మాంస ప్రియులకు శుభవార్త.. మొన్నటివరకు భారీగా పెరిగిన చికెన్ ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. మార్కెట్లో మటన్ ధరలు అధికంగా ఉండటంతో సామాన్యులు చికెన్, చేపలు తినేందుకు మక్కువ చూపిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇటీవల ఫాంలలో బర్డ్ ఫ్లూ బారిన పడి కోళ్లు పెద్ద ఎత్తున మరణించడంతో డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగాయి.
తాజాగా చికెన్ ప్రియులకు శుభవార్త లభించింది.హైదరాబాద్‌లో కిలో చికెన్ ధర ప్రస్తుతం రూ.220 నుంచి 230 వరకు పలుకుతుండగా.. గతవారం రూ.260 వరకు అమ్మకాలు జరిపారు. ఇక కరీంనగర్‌లో రూ.220 నుంచి రూ.240 వరకు అమ్ముతున్నట్లు తెలిసింది. కాకినాడ, విశాఖపట్టణంలో సైతం రూ.220 నుంచి రూ.240 వరకు అమ్ముతున్నారు. చిత్తూరులో మాత్రం రూ.160 నుంచి రూ.170 పలుకుతున్నట్లు తెలుస్తోంది.