తమిళనాడు రాష్ట్రంలోని అరంబాక్కంలో స్కూల్ నుండి ఇంటికి వెలుతున్న విద్యార్థి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. విద్యార్థి వెళ్లే దారిలో రోడ్డు మీద నిలిచిన వర్షపు నీటిలో నడుస్తుండగా కరెంటు తీగ తగిలి ప్రాణాలతో బాలుడు కొట్టుమిట్టాడుతున్నాడు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న బాలుడిని కన్నన్ అనే యువకుడు తన ప్రాణాలకు తెగించి ధైర్యంగా రక్షించాడు.అటువైపు వెళుతున్న వారు ఎవరూ కూడా భయపడి సాహసం చేయకుండా ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. ఆ సమయంలో తన ప్రాణాలకు తెగించి బాలుడిని యువకుడు కాపాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, తమిళనాడు వ్యాప్తంగా యువకుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
చెన్నై :
అరంబాక్కంలో స్కూల్ నుండి ఇంటికి వెలుతున్న సమయంలో రోడ్డుమీదా నిలిచిన వర్షపు నీటిలో నడుస్తుండగా కరెంటు తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలుడు
కరెంట్ షాక్ తో నీటిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని ధైర్యంగా రక్షించిన యువకుడు కన్నన్.
అటువైపు వెళుతున్న వారు ఎవరూ… pic.twitter.com/7K07bL3jCU
— Telangana Awaaz (@telanganaawaaz) April 20, 2025