మాదకద్రవ్యాలు(డ్రగ్స్) రహిత సమాజం కోసం కృషి చేద్దామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం చేయి చేయి కలుపుదామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని టీ వర్క్స్ నుంచి ఐటీసీ వరకు గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్చువల్ సందేశం పంపిన మెగాస్టార్ చిరంజీవి.. వ్యసనాలకు బానిసలై కొందరు తమ కలలను దూరం చేసుకుంటున్నారని అన్నారు. అలాంటి వారిని రక్షిద్దామని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మనందరం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు.