కోట్లాది మంది అన్నదాతలకు గుడ్ న్యూస్…రిజిస్టర్ అయితే ఈ ప్రయోజనాలన్నీ…

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకొచ్చింది. కొన్ని స్కీమ్స్ ని రైతుల కోసం కూడా తీసుకొచ్చింది. అయితే ఈ స్కీమ్స్ ద్వారా రైతులకి ఎంతగానో బెనిఫిట్ కలుగుతోంది. మోదీ సర్కార్ తాజాగా ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దేశమంతటా కూడా ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగింది. పంటలను ఇన్సూరెన్స్ చేయించుకోవాలని రైతులతో చెప్పారు. అయితే నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కింద రైతులకు ఫసల్ బీమా యోజన గురించి చెబుతామన్నారు. ఇది ఇలా ఉంటే ఫసల్ బీమా యోజన కింద నమోదు చేసుకున్న రైతులకు పాలసీ డాక్యుమెంట్లు ఇంటి వద్దనే ఇస్తామని అన్నారు.

ఫసల్ బీమా యోజన కింద చెల్లించే డబ్బులు డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లోనే పడతాయి అని చెప్పారు. ఈ స్కీమ్స్ వల్ల రైతులకు దళారులు, దళారుల బారి నుంచి విముక్తి లభించిందని అన్నారు. కరువు, తుఫాను, అకాల వర్షం, వరదలు, కొండ చరియలు విరిగిపడటం, వడగళ్ల వాన, పురుగుల బెడద మొదలైన ప్రమాదాలు ఏమైనా పంటలకు కలిగితే బీమా రక్షణ లభిస్తుంది.

అలానే ఫసల్ బీమా యోజనలో చేరడం వల్ల విత్తడం నుంచి పంట కోత వరకు పంట నష్టం నుంచి రక్షణ ఉంటుంది. గత ఆరేళ్లలో 36 కోట్ల మంది రైతులు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద బెనిఫిట్ పొందారు. దీని కోసం రైతులు ఆన్ లైన్ లో చేరచ్చు.

దీని కోసం మీరు https://pmfby.gov.in వెబ్‌సైట్‌కు వెళ్ళాలి.
అక్కడ ఫార్మర్స్ కర్నర్ అని ఉంటుంది.
దీనిపై క్లిక్ చేసి పథకంలో చేరొచ్చు.
కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పథకంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డ్ కాపీ, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ, భూమి పత్రాల కాపీ, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఇతర పత్రాలు అవసరం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version