ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. జీతం ఎంత పెరగనుందంటే..!

-

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుందా..? మోదీ సర్కార్ ఈసారి డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం మేర పెరగొచ్చని అంటున్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం ఊరట కలుగచ్చు. ఇప్పుడైతే డియర్‌నెస్ అలవెన్స్ 38 శాతంగా వుంది. ఒకవేళ కనుక ఇది 4 శాతం పెరిగితే అప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతానికి చేరుతుంది.

అలానే ఉద్యోగుల వేతనం కూడా పెరగనుంది. లేబర్ బ్యూరో కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ప్రకారం డీఏను ప్రతీ నెలా లెక్కిస్తారు. కార్మిక శాఖకు చెందిన ఒక అనుబంధ విభాగమే లేబర్ బ్యూరో. డిసెంబర్ నెలకు సంబంధించిన సీపీఐ ఐడబ్ల్యూ జనవరి 31న విడుదల అయ్యింది. దీని ప్రకారం అయితే డియర్‌నెస్ అలవెన్స్ 4.23 శాతం మేర పెరగాలి.

కేంద్రం పాయింట్ తర్వాత ఉన్న నెంబర్లను పరిగణలోకి తీసుకోదు కనుక డీఏ పెంపు 4 శాతంగా వుండచ్చట. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్‌పెండేచర్ డిపార్ట్‌మెంట్ డీఏ పెంపునకు సంబంధించి ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తారట. 2023 జనవరి 1 నుంచి డీఏ పెంపు అమలులోకి వస్తుంది. చివరిగా డీఏ పెంపు 2022 సెప్టెంబర్ 28న జరిగింది. 2022 జూలై 1 నుంచి వర్తిస్తుంది ఇది. ప్రతి సంవత్సరం రెండు సార్లు దీన్ని పెంచచ్చు. జనవరి నుంచి జూన్ వరకు ఒకసారి డీఏ పెంపు ఉంటుంది. ఆ తరవాత డిసెంబర్ వరకు ఇంకోసారి డీఏ పెంపు ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version