అన్నదాతలకు తీపికబురు అందించేందుకు కేంద్రం..!

-

కేంద్రం రైతుల కోసం వివిధ రకాల స్కీమ్స్ ని తీసుకు రావడం, వారి కోసం ఆర్ధికంగా పలు విధాలుగా కృషి చేస్తోంది. అయితే తాజాగా వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని పెంచొచ్చని తెలుస్తోంది. వ్యవసాయ రంగానికి అధిక రుణం అందించాలని ప్రభుత్వం అనుకుంటోంది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ఈ అంశం గురించి కీలక ప్రకటన ఉండేలా కనపడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.16.5 లక్షల కోట్లుగా నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అయితే
రూ.18 నుంచి 18.5 లక్షల కోట్లకు చేరేటట్టు కనపడుతోంది.

ప్రతీ సంవత్సరం కూడా అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్‌ను పెంచుతూ వెళ్తోంది. ఈసారి కూడా అలానే చేసేలా కనపడుతోంది. కొన్ని సార్లు అయితే నిర్దేశిత లక్ష్యం కన్నా వ్యవసాయ రంగానికి అధిక రుణాలు మంజూరు చేస్తున్నారు. సాధారణంగా వ్యవసాయ రుణాలకు వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. అయితే ప్రభుత్వం మాత్రం వడ్డీ రాయితీ ప్రయోజనం కల్పిస్తోంది.

రూ.3 లక్షల వరకు రుణాలపై 2 శాతం తగ్గింపు లభిస్తోంది. దీనితో వడ్డీ రేటు ఏడు శాతంగా తగ్గినట్టు అవుతుంది. సరైన సమయానికి కడితే వడ్డీ రేటు మరో 3 శాతం తగ్గుతుంది. అంటే కేవలం 4 శాతం వడ్డీకే రుణం లభిస్తోందని చెప్పొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం ఎలాంటి తనఖా లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణాన్ని రైతులు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version