రైతులకు శుభవార్త..కనీస మద్దతు ధర పెంచుతూ మోడీ ప్రభుత్వం నిర్ణయం

-

కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రధాని నరేంద్ర మోడీ 3.0 సర్కార్ రైతులకు శుభవార్త అందించింది. రానున్న ఖరీఫ్ సీజన్‌లో 14 రకాలకు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.బుధవారం ప్రధాన మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 14 రకాల పంటల కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

తాజాగా వరికి క్వింటాకు రూ.117 కనీస మద్దతు ధర పెంపుతో క్వింటా వరి ధాన్యానికి రూ.2300కి చేరింది. వరితో పాటు మొక్కజొన్న, రాగి,పత్తి, జొన్న పంటలకు కూడా ఎమ్మెస్పీ పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మూడో సారి అధికారంలోకి రాగానే పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేసి రైతులకు శుభవార్త చెప్పిన మోడీ సర్కార్.. తాజాగా కనీస మద్దతు ధర పెంచుతూ మరో గుడ్ న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version