తాజాగా అమెరికాలోని ఓ న్యాయమూర్తి హెచ్-1బీ వీసా ఉన్న ఉన్న వారి జీవితభాగస్వాములు కూడా ఉద్యోగులు చేసుకోవచ్చు అని తీర్పును ఇచ్చారు. భారతీయులకు ఇదో గుడ్‌న్యూస్. ఒకరకంగా ఈ ఆదేశాలు భారతీయ టెకీలకు భారీ ఊరట కల్పించింది. అమెరికాలో ఉన్న టెక్నాలజీ కంపెనీలు చాలా వరకు హెచ్-1బీ వీసాలను జారీ చేస్తాయి. ఇండియా, చైనా లాంటి దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులపై ఆ కంపెనీలు ఆధారపడుతాయి. అయితే గతంలో ఒబామా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. హెచ్-1బీ వీసా ఉన్న భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకోవచ్చు అన్న నిబంధన ఎత్తివేయాలని ఆ సంస్థ కోరింది.
అయితే ఆ పిటిషన్‌ను అమెరికా జిల్లా జడ్జి తాన్యా చుక్టన్ తిరస్కరించారు. హెచ్-1బీ వర్కర్ల వల్ల తమకు ఉద్యోగాలు రావడం లేదని సేవ్ జాబ్స్ యూఎస్ఏ ఆరోపిస్తున్నది. కానీ ఆ సంస్థ వేసిన పిటీషన్‌ను మాత్రం అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. హెచ్-1బీ వీసాలు ఉన్న జీవిత భాగస్వాముల్లో సుమారు లక్ష మందికి అమెరికా సర్కారు వర్క్ పర్మిట్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీసా ఉన్న వారి జీవితభాగస్వాములు కూడా ఉద్యోగులు చేసుకోవచ్చు అని తాజాగా ఓ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు.