అల్పాహారం సమయంలో బొప్పాయి తీసుకుంటే… ఈ సమస్యలు అన్నీ దూరం..!

-

ఉదయం అల్పాహారం ఎంతో ముఖ్యం. అసలు ఉదయం అల్పాహారాన్ని స్కిప్ చేయకూడదు. ఉదయం లేచిన తర్వాత పనులన్నిటినీ పూర్తి చేసుకుని కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలి. అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ ఉంటారు అలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి. అయితే అల్పాహారం సమయంలో చాలా మంది పండ్లను కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే అల్పాహారం తీసుకునేటప్పుడు బొప్పాయిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

రాత్రి ఎప్పుడో అన్నం తింటాము తర్వాత మళ్లీ ఉదయం టిఫిన్ తింటాము అటువంటి సమయంలో బొప్పాయిని తీసుకుంటే కడుపు ఉబ్బరం కడుపులో మంట వంటివి తొలగిపోతాయి. ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం వుండవు. అలానే జీర్ణ సమస్యలు కూడా తొలగి పోతాయి. బొప్పాయిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కనుక దీన్ని తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది.

నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థకు కూడా ఇది మేలే చేస్తుంది. పేగు కదలకని ఈజీ చేస్తుంది బొప్పాయి. కాబట్టి మీరు తీసుకోవచ్చు. బొప్పాయి వలన గుండెకి కూడా మంచిదే మధుమేహం కూడా బొప్పాయితో అదుపులో ఉంటుంది. అలానే బొప్పాయిని తీసుకుంటే రక్తంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ శోషణని నియంత్రిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version