ఢిల్లీలో భారీ వర్షం… మరో 2 రోజులు ఇంతే !

-

వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం వేసవికాలం నడుస్తోంది అయినప్పటికీ దేశంలో పలు చోట్ల రుతుపవనాల ప్రభావం వలన వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుండి దేశ రాజధాని అయిన ఢిల్లీ లో వర్ష కురుస్తోంది. ఢిల్లీ లోని అనేక ప్రాంతాలలో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీని కారణంగా రోడ్లు మొత్తం వర్షపు నీటితో నిండిపోయి రాకపోకలకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించింది.

అయితే వాతావరణ శాఖా నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇంకా రెండు రోజుల పాటు ఢిల్లీలో ఈ వర్షాలు పడుతాయట. ఇక్కడ మాత్రమే కాకుండా… వాయువ్య భారతం తో పాటుగా పశ్చిమ హిమాలయ సరిహద్దు ప్రాంతాలలోనూ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెబుతోది.

Read more RELATED
Recommended to you

Exit mobile version