ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌..!

-

టాలీవుడ్ హీరో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ కి గుడ్ న్యూస్‌. ఎన్నో రోజుల నుండి ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ కి చిత్ర‌బృందం శుభ‌వార్త అందించింది. ప్ర‌భాస్ 20వ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్, టైటిల్‌‌ను జూలై 10న ఉద‌యం 10 గంట‌ల‌కి విడుదల చేయ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ మేరకు ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ప్ర‌భాస్ 20వ చిత్రం జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, పూజా హెగ్డే ఇందులో క‌థానాయిక‌గా నటిస్తోంది.

ఈ పోస్టర్ ను ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రభాస్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. ఇండస్ట్రీలో భారీ అంచనాలున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. ఈ సినిమాను వైజయంతి బ్యానేర్ పై అశ్వినీదత్ నిర్మిస్తాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version