కరోనా కారణం గా నిలిచిపోయిన రోడ్డు రవాణా సర్వీసులు ఇప్పుడిప్పుడే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. అన్లాక్ మార్గదర్శకాల లో భాగంగా అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభించు కోవాలని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించారు. అయితే ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఆర్టిసి ప్రయాణికులు అందరికీ శుభ వార్త చెప్పింది.
కరోనా వైరస్ సమయంలో ఉన్నపళంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే బస్సులు వినియోగించుకోలేని వారందరూ ప్రస్తుతం పాత బస్ పాస్ లను తిరిగి ఉపయోగించుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించి తెలంగాణ ఆర్టీసీ. నవంబర్ 30 లోపు ఉన్న పాత ఐడి కార్డు టికెట్ను కౌంటర్లలో ఇచ్చి కొత్త పాస్ తీసుకునేందుకు బస్సు ప్రయాణికులు అందరికీ టిఎస్ఆర్టిసి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇది ఆర్టీసీ ప్రయాణికులకు అందరికీ అదిరిపోయే శుభవార్త అని చెప్పాలి.