ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఇంటి వద్దే ఉంటూ 10 సర్వీసులు పొందండిలా..!

-

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా లాక్‌డౌన్‌లో అనేక స్కీంలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎస్‌బీఐ.. తాజాగా మరో పది స్కీంలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సాయంతో ఈ సేవలను వినియోగదారులు పొందవచ్చు. వినియోగదారుల సౌకర్యార్థం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. వినియోగదారుల సమయాన్ని వృథా చేయకుండా.. బిజీగా ఉండి బ్యాంకుకు రాలేని వారి కోసం ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్‌ను ప్రారంభించింది.

ఎస్‌బీఐ

ఎస్‌బీఐ డోర్‌స్టెప్ సేవల ద్వారా 10 రకాల సౌకర్యాలను బ్యాంకు కల్పిస్తోంది. వినియోగదారులు ఇంటి వద్దే ఉంటూ ఈ సేవలను పొందవచ్చు. నగదు డివిజిట్ నుంచి ఉపసంహరణ వరకు, చెక్ డిపాజిట్ వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు వయోవృద్ధులు అవసరాలు కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తామన్నారు. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, బ్యాంకుకు సంప్రదిస్తే ఉద్యోగులే మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తారని పేర్కొంది.

ఎస్‌బీఎస్ ఈ క్రింది పేర్కొన్న పది సేవలను డోర్‌స్టెప్ ద్వారా అందించనుంది. నగదు తీసుకోవడం, నగదు చెల్లించడం, చెక్ తీసుకోవడం, చెక్‌బుక్ అప్లై చేయడం, డ్రాఫ్ట్ హోమ్ డెలివరీ, టర్మ్ డిపాజిట్ కోసం హోమ్ సిట్టింగ్ సలహా, కెవైసీ అప్‌డేట్, ఏదైనా రుణంపై సమాచారం, హౌసింగ్ లోన్‌పై సమాచారం, ఆదాయపు పన్ను చలాన్, పెన్షనర్ల, వృద్ధులకు జీవిత ధ్రువీకరణ పత్రం అందజేత వంటి సేవలను ఎస్‌బీఐ కల్పిస్తోంది.

వినియోగదారులు ఎస్‌బీఐ కల్పిస్తున్న ఈ సేవలను వినియోగించుకోవాలంటే ముందుగా మీరు మీ పేరును రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం 1800-1037-188, 1800-1213-721 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలి. మీరు ఎస్‌బీఐ వినియోగదారులైతే మీ నుంచి కొన్ని ప్రాథమిక సమాచారాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల ప్రారంభిస్తారు. అయితే ఈ సేవలను టోల్ ఫ్రీ నంబర్‌తోపాటు, ఎస్‌బీఐ మొబైల్ యాప్‌ ద్వారా కూడా పొందవచ్చు. ఎస్‌బీఐ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకుని మీ నమోదు చేసుకుంటే సరిపోతుంది. లేదా, పూర్తి వివరాలను www.psbdsb.in వెబ్ సైట్‌కి లాగిన్ అయి సమాచారం తెలుసుకోవచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version