విద్యుత్‌ రంగంలోనూ పోర్టబులిటీ.. త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం..?

-

మొబైల్‌ ఫోన్లను వాడుతున్న వినియోగదారులందరికీ ప్రస్తుతం ఎంఎన్‌పీ సేవలు అందుబాటులో ఉన్న విషయం విదితమే. ఒక టెలికాం కంపెనీకి చెందిన నెట్‌వర్క్‌, దాని సేవలు నచ్చకపోతే ఇంకో నెట్‌వర్క్‌ లోకి మారవచ్చు. పోర్టింగ్‌ విధానంలో ఈ విధంగా ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు మన ఫోన్‌ నంబర్‌ను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇదే విధానాన్ని త్వరలో విద్యుత్‌ రంగంలోనూ అందివ్వనున్నారు.

ఇకపై విద్యుత్‌ వినియోగదారులు తాము వాడుతున్న విద్యుత్‌ను అందిస్తున్న కంపెనీ సేవలు నచ్చకపోతే ఇంకో కంపెనీకి మారవచ్చు. త్వరలోనే ఇందులోనూ పోర్టింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు కొత్త విద్యుత్‌ చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టానికి చెందిన డ్రాఫ్ట్‌ బిల్లును అనుమతి కోసం కేబినెట్‌ ఎదుట ఉంచారు. కేబినెట్‌ నుంచి అనుమతి లభించిన తరువాయి ఆ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో బిల్లుకు ఆమోదం లభించనుంది.

కొత్త బిల్లు అమలులోకి వస్తే వినియోగదారులు తాము వాడుతున్న విద్యుత్‌ కంపెనీని మార్చవచ్చు. అయితే ప్రస్తుతానికి కేవలం కొన్ని విద్యుత్‌ కంపెనీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కనుక విద్యుత్‌ రంగంలో పోర్టింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలంటే అందులో కొత్త కంపెనీలు రావాలి. అందుకనే కొత్త కంపెనీల ఏర్పాటుకు కూడా కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాని ప్రకారం ఎవరైనా సరే విద్యుత్‌ కంపెనీలను ఏర్పాటు చేయవచ్చు. దీంతో కంపెనీల మధ్య పోటీ ఉంటుంది. అది వినియోగదారులకు మేలు చేస్తుంది. వారు తమకు నచ్చిన కంపెనీకి మారి విద్యుత్‌ను పొందవచ్చు. దీంతో విద్యుత్‌ రంగంపై కంపెనీల నియంత్రణ తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version