విద్యార్థులకు శుభవార్త.. రాష్ట్రంలో కొత్త మెనూ ప్రారంభం

-

తెలంగాణలో గత కొంతకాలంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆహారం కలుషిత అవడం వలన 42 మంది విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే.అనేక మంది ఆసుపత్రుల పాలయ్యారు. దీనిపై ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని కార్నర్ చేశాయి. దీంతో ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ప్రజాపాలనలో విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం సర్కారు అడుగులు వేస్తుందని సీఎం ప్రకటించారు.

పేద వర్గాల విద్యార్థులకు పోషకాహారం అందించడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో కొత్త ఆహార మెనూ తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. నియమావళిలో పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచనున్నట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో 8 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగబోతుందని మంత్రి సీతక్క చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version