గురుకులాల్లో విద్యాప్రమాణాలు పెంచాలని నిర్ణయం : సీఎం రేవంత్ రెడ్డి

-

గురుకులాల్లో విద్యాప్రమాణాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ చిరుకూరు గురుకుల పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకులాల్లో మల్టీ టాలెంటేడ్ విద్యార్థులున్నారని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివితే రాణిస్తారని ఒక అపోహ ఉండేది. కానీ ఆ అపోహను తొలగించి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా రాణిస్తారని నిరూపించాలి. ఇప్పటికే పలువురు నిరూపించారు.

TGPSC కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం కూడా గురుకుల పాఠశాలలోనే చదివారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారం అందిస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచలేదు. తమ ప్రభుత్వమే పెంచిందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు అండగా నిలిచామని తెలిపారు. విద్యార్థులకు పెట్టే ప్రతీ పైసా దేశ అభివృద్ధి కోసం పెట్టే పైసాగా భావించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version