హైదరాబాద్ నగరవాసులకు అదిరిపోయే శుభవార్త..!

-

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాడు నిలిచిపోయిన ఆర్టీసి బస్సులు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా రోడ్ ఎక్కలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభించాలని అనుమతి ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు సరైన నిర్ణయం తీసుకోలేదు. అయితే రేపటి నుంచి హైదరాబాద్ సిటీ బస్సులు అన్ని ప్రారంభం కాబోతున్న తెలుస్తోంది.

ఇప్పటికే నగర శివార్లలోని ఇతర ప్రాంతాలకు కూడా బస్సు సర్వీసులను ప్రారంభించింది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ. అయితే ప్రస్తుతం పాక్షికంగా మాత్రమే బస్సు సర్వీసులను ప్రారంభించగా.. రేపటి నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు లేక అధిక మొత్తంలో చెల్లించి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న ఎంతో మంది ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు ప్రారంభం అయితే ఎంతో ఊరట కలిగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version