తెలంగాణ ప్రజలకు శుభ వార్త.. త్వరలోనే 4 వేల పల్లె దవాఖనాలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక, తాత్కాలిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో… నాలుగు వేల పల్లె దవాఖానాలను తీసుకురాబోతున్నామని ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు. రాబోయే రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల తో… ప్రభుత్వ వైద్యం పోటీపడాలి అనేది తమ లక్ష్యమని… ఆ దిశగా సర్కార్ వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు.

kcr

బస్తి దావఖాన ల తో మంచి ఫలితాలు రావడంతో సీఎం కేసీఆర్ పల్లె దావకాన పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలంగాణలో 2014కు ముందు కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండేవని… ఇప్పుడు వాటిని 43 పెంచామని పేర్కొన్నారు. వీటి ద్వారా పదివేల మందికి సేవలు అందుతున్నాయని…. ఇప్పటి వరకు ఈ పథకం కింద 100 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా సింగిల్ యూస్ డయా లైజర్ వినియోగించే విధానాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నామని… ఇప్పటి వరకు ఈ పద్ధతిలో ఇలాంటి సమస్యలు తలెత్తే లేదని అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version