రిటైర్డ్ ఉద్యోగులకు పోస్టల్ శాఖ శుభవార్త.. ఇకపై ఇంటివద్దకే ఆ సేవలు

-

ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వారికి తపాలా శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై వారు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందే సౌకర్యాన్ని సులభతరం చేస్తూ పోస్టాఫీస్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల మేరకు పింఛన్ పొందాలనుకునే వారు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందేలా అవకాశం కల్పించారు.అందుకోసం పెన్షనర్లు, కుటుంబ పింఛన్‌దారులు పోస్టాఫీస్‌లో లేదా పోస్ట్‌మ్యాన్‌‌‌కు రూ.70 ఫీజు చెల్లించాలి.

పింఛన్‌దారుల ఆధాన్, మొబైల్, PPO నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు థంబ్ ఇప్రెషన్‌తో నిమిషాల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు.కాగా, పెన్షనర్లు ప్రతి ఏటా నవంబర్ నెలలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం తప్పనిసరి. లేనియెడల వారి పెన్షన్‌ను అధికారులు నిలిపివేస్తారు.ఈ క్రమంలోనే లైఫ్ సర్టిఫికెట్ కోసం కేంద్ర తాజా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కోసం దేశ వ్యాప్తంగా నవంబర్ 1 నుంచి ప్రచారాన్నిసైతం ప్రారంభించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version