డ్రగ్స్‌పై ఎక్సైజ్ శాఖ క్లారిటీ.. కాంగ్రెస్‌ని ఏకీపారేస్తున్న బీఆర్ఎస్!

-

జన్వాడ ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రేవ్ పార్టీ నిర్వహించారని, డ్రగ్స్ కూడా దొరికాయని తెలంగాణ పోలీసులు ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా యువతీయువకులు పట్టుబడ్డారని, ఫారిన్ మద్యం సైతం స్వాధీనం చేసుకున్నామని తొలుత కథనాలు వచ్చాయి. ఆ తర్వాత నెమ్మదిగా అది రేవ్ పార్టీ కాదు ఫ్యామిలీ పార్టీ అని తేల్చారు.

మరల అక్కడ పట్టుబడింది యువతీయువకులు కాదు.. ఫ్యామిలీ కపుల్స్, చిన్నారులు, వృద్ధులు సైతం ఉన్నారని ఆదివారం సాయంత్రం వరుస కథనాలు వచ్చాయి. ఇక నెదర్లాండ్ నుంచి వచ్చిన మద్దూరి విజయ్ కొకైన్ సేవించాడని,అతనికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు ఆరోపించారు. తీరా చూస్తే అది జరిగింది కేటీఆర్ ఫాంహౌస్ కాదని, తన బావమరిది గృహప్రవేశం ఫంక్షన్ అని నిర్దారణ అయ్యింది. అక్కడ డ్రగ్స్ దొరకలేదని తాజాగా ప్రభుత్వ ఎక్సైజ్ అధికారులు మీడియాకు చెప్పారు. దీంతో కాంగ్రెస్ దొంగలు మాత్రం వండి వార్చిన అబద్ధాలు ప్రచారం చేసి శునకానందం పొందుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ అధికార పార్టీని నెట్టింట ఏకీపారేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version