ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఇకనుంచి గిరిజనులకు… సిలిండర్లు పంపిణీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూలకొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఇకనుంచి 14.2 కేజీల ఎల్పిజి సిలిండర్లను ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

దీపం 2 పథకం కింద ప్రస్తుతం ఐదు కేజీల సిలిండర్లను ఇస్తుండగా వాటి స్థానంలో 14.2 కేజీల సిలిండర్లను ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబునాయుడు పూటకి ప్రభుత్వం. ఎందుకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్ అలాగే డాక్యుమెంటేషన్…. చార్జీల కోసం 5.54 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపింది. ఈ మేరకు డబ్బులు కూడా రిలీజ్ చేసేది. మొత్తం 23,912 మంది లబ్ధిదారులకు ఈ సిలిండర్లు అందనున్నాయి.