మలయాళ నటి నవ్య నాయర్ కు బిగ్ షాక్ తగిలింది. మల్లెపూలు పెట్టుకొని ఆస్ట్రేలియాకు బయలుదేరింది ఈ భామ. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ అధికారులు నవ్య నాయర్ కు మల్లెపూలు పెట్టుకొని విమానం ఎక్కినందుకు రూ. 1.14 లక్షల జరిమానా విధించారు. నవ్య నాయర్ ఓనం కార్యక్రమంలో పాల్గొనేందుకు మెల్బోర్న్ బయలుదేరింది. ఎయిర్పోర్ట్ చెకింగ్ లో తన వద్ద మల్లెపూలు కనిపించాయి.

దీంతో అధికారులు బయో సెక్యూరిటీ చట్టాలకు విరుద్ధం అంటూ నవ్య నాయర్ కు రూ. 1. 14 లక్షల రూపాయల ఫైన్ విధించారు. పూలు, పండ్లు, విత్తనాలను విమాన ప్రయాణంలో తీసుకెళ్లడం వల్ల తోటి ప్రయాణికులకు వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పూలు, పండ్లు, విత్తనాలను నిషేధించారు. పొరపాటున కూడా పూలు, పండ్లు, విత్తనాలను తీసుకెళ్తే కఠినమైన చట్టాలను అమలులోకి తీసుకోవచ్చారు. దీంతో ఈ భామ అధికారులకు జరిమానాను చెల్లించింది.