నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

-

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అనేది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉంది. కాగ ఉద్యోగాల భ‌ర్తీపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్టమైన ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ తాజా గా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ రోజు వ‌న‌ప‌ర్తి లో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టిస్తున్న విషయం తెలిసిందే. కాగ ఈ ప‌ర్య‌ట‌న లో వ‌న‌ప‌ర్తి జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

నిరుద్యోగం పై కూడా సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు నిరుద్యోగుల‌కు అంద‌రికీ గుడ్ న్యూస్ చెబుతాన‌ని అన్నారు. నిరుద్యోగులు అంద‌రూ 10 గంట‌ల‌కు అల‌ర్ట్ గా ఉండి.. ప్ర‌క‌ట‌న చూడాల‌ని అన్నారు. కాగ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. నిరుద్యోగ భృతి తో పాటు భారీ సంఖ్య‌లో ఉద్యోగాల భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. అలాగే ఉద్యోగాల భ‌ర్తీకి ఒక ప్ర‌త్యేక క్యాలెండ‌ర్ విడుదల చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version