ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని , మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…కేంద్రంపై ఫైర్ అయ్యారు. దేశం కోసం తాను ప్రాణాలు అర్పిస్తాం అని ప్రకటించారు.
దేశం కోసం పోరాడేందుకు ముందుకు వెళ్లాలని… తెలంగాణ ఉద్యమంలో ఇలా కొట్టడమో… అదేవిధంగా దేశం కోసం పోరాటం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అలాగే నిరుద్యోగులు అంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని సీఎం కేసీఆర్ కోరారు.
దేశంలో ఈ మధ్య గోల్ మాల్ గోవిందంగాళ్లు మోపయ్యారని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రజలకు కుల పిచ్చి, మత పిచ్చి లేపి దుర్మార్గమైన చర్యలు చేసేలా చేస్తున్నారు. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గమైన పద్దతిలో రాజకీయాలను మంట కలిపే ప్రయత్నం చేస్తున్నారు. కులం, మతం జాతి లేకుండా.. ప్రజలంతా బాగు పడాలని ఆయన అన్నారు. తెలంగాణలో జరిగిన విధంగానే భారత దేశం కూడా డెవలప్ కావాలని అన్నారు.