నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్, క్యాలెండర్ విడుదలపై ఆయన కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్లుగా త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 పరీక్ష కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చి మొన్ననే ముగసిందని, కోడ్ ముగియడంతో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ స్టార్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబును చూసి నేర్చుకోవాలన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్కు శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మేము చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నామని, మీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తున్నామని రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే హరీష్ రావు పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. మేం తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తామని, ఏపీ ఆలోచనలు కాదని. కౌంటర్ ఇచ్చారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేదని.. వాళ్ల హయాంలో గుర్రాలతో ఆశ వర్కర్స్ను తొక్కించారని గుర్తు చేశారు. పెద్దపల్లి ఘటనపై విచారణ జరుగుతుందని తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారం జరగడం దురదృష్టకరమని అన్నారు. శాంతి భద్ర విషయంలో మా ప్రభుత్వం సీరియస్ గా ఉందని తేల్చి చెప్పారు. మతఘర్షణల విషయంలో సీరియస్ ఉన్నామని.. మెదక్ అల్లర్ల ఘటన వెనక ఎవరి హస్తం ఉన్న ఉక్కు పాదంతో అణిచివేస్తామని స్పష్టం చేశారు.