రైల్వే ప్రయాణికులకు ఇప్పుడు గుడ్ న్యూస్. తాజాగా ఐఆర్‌సీటీసీ కొత్త సేవలు వచ్చాయి. వీటి వల్ల అప్‌డేటెడ్ చాట్ సర్వీసులను ఉపయోగించవచ్చు. మరి దాని గురించి ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. వివరాల్లోకి వెళితే.. ఐఆర్‌సీటీసీ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకు రావడం తో ట్రైన్ ప్యాసింజర్లు వారి సందేహాలను వెంటనే పరిష్కరించుకోవచ్చు. అయితే సులువుగా ఏ సందేహానికైనా సమాధానాలు తీసుకోవచ్చు.
ఇది ఇలా ఉండగా రోజుకు దాదాపు 10 లక్షలకు పైగా క్వైరీస్ వస్తున్నాయన్న సంగతి చెప్పడం జరిగింది. అలానే 139కు కాల్ చేయడం దగ్గరి నుంచి ఈమెయిల్స్ వరకు ప్రయాణికులకు వారి సందేహాలు పరిష్కరించుకుంటున్నారు. అంతే కాకుండా ఎస్ఎంఎస్ పంపడం కూడా ఈ బెనిఫిట్ పొందొచ్చు. లేదు అంటే చాట్ బాట్ ద్వారా కూడా సందేహాలు తీర్చుకోవచ్చు. ఏదైనా సరే ఈజీగా సమాచారంని పొందొచ్చు.