మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైఎస్సార్ కడప జిల్లా లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మొత్తం 69 ఆశా వర్కర్ల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
ఇక వయస్సు విషయానికి వస్తే డిసెంబర్ 1, 2022వ తేదీ కి అభ్యర్థుల వయస్సు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే పట్టణ/గ్రామీణ ప్రాంతంలో వుండే గృహిణేలే అర్హులు. ఇక ఇది ఇలా ఉంటే విడో/డివోర్స్/ఒంటరి మహిళలు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు.
అలానే తెలుగు భాషలో రాయడం, మాట్లాడడం, చదవడం వచ్చి ఉండాలి. పదవ తరగతి ప్యాస్ అయ్యి ఉండాలి. అకడమిక్ మెరిట్, రిజర్వేషన్, పని అనుభవం చూసి సెలెక్ట్ చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసేందుకు ఆఖరి తేదీ డిసెంబర్ 12, 2022. ఇక శాలరీ విషయానికి వస్తే… నెలకు రూ.10,000ల చొప్పున జీతంగా ఇస్తారు. పూర్తి వివరాలని https://kadapa.ap.gov.in/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.
చిరునామా: District Medical and Health Officer, collector and District Magistrate, Kadapa, YSR District, AP.