ఆంధ్రప్రదేశ్ పాలక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైసిపి ప్రభంజనం సృష్టిస్తోంది. జగన్ పరిపాలన అద్భుతంగా ఉండటంతో చాలా వరకు టీడీపీ పార్టీకి చెందిన నాయకులు వైసీపీ పార్టీ లోకి వచ్చేస్తున్నారు. ఈ పరిణామంతో కింద క్యాడర్ కూడా వైసిపి పార్టీ జెండా కప్పుకుంటున్నారు. ఇంకా చాలా చోట్ల వైసిపి పార్టీ ఏకగ్రీవ స్థానాలు నమోదు చేసుకుంది. ఇటువంటి తరుణంలో ఎన్నికలు జరగకముందే చాలామంది వైసీపీ పార్టీ తరఫున విజేతలుగా తేలారు. అనూహ్యంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను దాదాపు ఆరు వారాల పాటు వాయిదా వేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాతావరణం మారిపోయింది.
ఏకగ్రీవంగా ఎంపికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గురించి స్పష్టత ఇచ్చారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనవారు అలాగే కొనసాగుతారని చెప్పారు. వాళ్ల పదవులకు వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవని అన్నారు. గెలిచిన వారితో కలిసి ఏకగ్రీవంగా ఎన్నికైన వారు బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. దీంతో ఎన్నికలకు వెళ్లక ముందే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన విజేతలకు ఇదొక సూపర్ గుడ్ న్యూస్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.