తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఆమోదం

-

తెలంగాణ, ఆంధ్రకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల విభజన సమస్యలు ఏళ్లుగా పెండింగ్ లోనే ఉన్నాయి. తాజాగా వాటి పరిష్కరణకు కేంద్రం దృష్టి సారించినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల మధ్య హైవేస్ కనిక్టివిటీ పెంచడానికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి ముందుకొచ్చింది.

అమరావతి-హైదరాబాద్ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.త్వరలోనే డీపీఆర్‌ రెడీ చేసి ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించింది. ఇదిలాఉండగా, త్వరలోనే అమరావతి రింగ్ రోడ్డు ప్రారంభంకానుంది. దీనికి ఉత్తరభాగం నుంచి హైవే నిర్మాణానికి అనుమతి కోరుతూ ఏపీ సర్కారుకు కేంద్ర హోంశాఖ లేఖ రాసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news