తాడిపత్రిలో సైకో వీరంగం..పోలీసుల పైకి రాళ్లు రువ్వుతూ!

-

ఏపీలోని అనంతరపురం జిల్లా తాడిపత్రి మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం గుర్తుతెలియని సైకో నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. అంతేకాకుండా తాడిపత్రిలోని బండా మసీదు ఎదురుగా రెండవ అంతస్తు పై స్థావరం ఏర్పాటు చేసుకున్న సదరు సైకో..

కర్రలు, రాళ్లతో సామాన్యులపై దాడి చేసేందుకు యత్నించాడు. రోడ్డుపై వెళ్లే వారిపై రాళ్లు విసురుతూ నానా హంగామా సృష్టించాడు. పోలీసులపై కూడా ఈ సైకో రాళ్లు విసిరినట్లు తెలిసింది. మొత్తానికి ఆ వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. కాగా, సదరు వ్యక్తిని కౌన్సిలింగ్ కోసం పోలీసులు పంపించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news