మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వానికి చెందిన తిరువరూర్ లోని సెంట్రల్ యూనివర్సటీ ఆఫ్ తమిళనాడు లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఫ్యాకల్టీ పోస్టులభర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కనుక నోటిఫికేషన్ లో వున్నా అర్హతలను చూసుకుని అప్లై చేసుకోండి. దీనిలో మొత్తం 25 ఖాళీలు వున్నాయి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ప్రొఫెసర్: 4, అసోసియేట్ ప్రొఫెసర్: 10, అసిస్టెంట్ ప్రొఫెసర్: 11. కామర్స్, హిస్టరీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, లా, మేనేజ్మెంట్, జియోగ్రఫీ, అప్లైడ్ సైకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు 65 ఏళ్లకు మించరాదు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే విధంగా అనుభవం కూడా తప్పని సరిగా ఉండాలి.
అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు చెల్లించాలి. జనరల్/ఓబీజీ అభ్యర్ధులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూడీ అభ్యర్ధులు అయితే రూ. 500 . దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 19, 2022. పూర్తి వివరాలను https://cutn.ac.in/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.