అన్నదాతలకు గుడ్ న్యూస్…. ఆ స్కీమ్ తో అదిరే లాభాలు.. అర్హత, దరఖాస్తు వివరాలు ఇవే..!

-

ఎన్నో స్కీమ్స్ ని రైతుల కోసం కేంద్రం తీసుకు వచ్చింది. కేంద్రం తీసుకు వచ్చిన ఈ స్కీముల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. ఈ స్కీమ్స్ తో రైతులు ఎన్నో లాభాలని పొందొచ్చు. కర్షకుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్రం స్కీములని తీసుకొచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ ఫసల్ బీమా యోజన, పీఎం కుసుం యోజన, పీఎం కృషి సించాయి యోజన ఇలా పలు పథకాల్ని తీసుకు వచ్చింది. వీటి ద్వారా ద్వారా రైతులకు చేయూతనందిస్తోంది ప్రభుత్వం. పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన అనే పథకాన్ని కూడా కేంద్రం రైతుల కోసం తీసుకొచ్చింది.

వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించే ఉద్దేశంతో సబ్సిడీ పై రైతులకు ట్రాక్టర్లు అందిస్తోంది కేంద్రం. వ్యవసాయం మొదలు పెట్టాలంటే ట్రాక్టర్ తప్పక ఉండాలి. రైతులు అందరికీ కూడా ట్రాక్టర్ ఉండాల్సిందే. మొదటి నుండి పండిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్లే వరకు ట్రాక్టర్ అవసరం ఉంటుంది. అయితే రైతుల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ట్రాక్టర్ కొన లేని వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ పథకం ద్వారా రైతులు ఏ కంపెనీ ట్రాక్టర్లనైనా సగం ధరకే కొనుగోలు చేయొచ్చు. ఇంకా సగం డబ్బును ప్రభుత్వం రాయితీ కింద ఇస్తుంది.

పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతులకు 20 శాతం నుంచి 50 శాతం వరకు సబ్సిడీని ఇస్తున్నాయి. పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన ద్వారా సబ్సిడీపై ట్రాక్టర్ తీసుకోవాలంటే లబ్ధిదారుడిపైరుపై వ్యవసాయ భూమి తప్పక ఉండాలి. భూమి పాస్ బుక్, బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వంటివి తప్పక ఉండాలి. ఈ వివరాలను తీసుకుని సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చెయ్యాల్సి వుంది. ట్రాక్టర్ బ్రాండ్, మోడల్‌ను బట్టీ దాని ధర పై 40 శాతం నుంచి 50 శాతం వరకు సబ్సిడీ ని రైతులు పొందొచ్చు. రైతులు 50 శాతం ప్రభుత్వం నుంచి రుణంగా తీసుకోవచ్చు. రీఫండెబుల్ అప్లికేషన్ ఫీజు రూ.4250 చెల్లించాలి. ఎన్ఓసీ ఫీ రూ.25,600 కట్టాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version