అన్నదాతలకు కేంద్రం శుభవార్త..!

-

కేంద్రం రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన చాలా రకాల లాభాలని మనం పొందొచ్చు. అయితే రైతుల కోసం కేంద్రం అందించిన స్కీమ్స్ లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఒకటి. ప్రభుత్వం రైతుల పంటలకు బీమా సౌకర్యం ని కలిపిస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే…

ఈ పధకం కింద ప్రభుత్వం రైతుల పంటలకు బీమా సౌకర్యంను ఇస్తోంది. దీని ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో మార్పులు చేసారు. దీని వలన రైతులకి ప్లస్ అవుతుంది. వాతావరణం కారణంగా ప్రస్తుతం పంటల బీమా పథకానికి డిమాండ్ ఉంటుందని ప్రభుత్వం అంటోంది. పైగా ఇప్పుడు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. ఖరీఫ్ పంట కోసం, మీరు బీమా మొత్తంలో 2% వరకు ప్రీమియం ని కట్టాల్సి వుంది.

రబీ పంటకు 1.5 శాతం వరకు ప్రీమియం ని కట్టాల్సి వుంది. ఇక దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది చూస్తే.. దీని కోసం ఎవరైనా ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీని ద్వారా అన్నదాతలు సులభం గానే పొందవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఎవరైన సరే ఈ స్కీమ్ లో రిజిస్టర్ చెయ్యచ్చు. బ్రాంచ్‌ కోఆపరేటివ్ బ్యాంక్, పబ్లిక్ సర్వీస్ సెంటర్, లేదంటే ఆథరైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ కి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ లో కూడా పంట బీమా కోసం నమోదు చేసేందుకు అవుతుంది. పీఎంఎఫ్‌బీవై వెబ్‌సైట్‌ ని ఓపెన్ చేసి మీరు క్లెయిమ్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. అంతే కాక క్లెయిమ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version