అన్నదాతలకు గుడ్ న్యూస్.. హోలీలోగా స్కీమ్ డబ్బులు..!

-

కేంద్రం వివిధ రకాల స్కీమ్స్ ని ప్రవేశపెట్టింది. రైతుల కోసం కూడా కేంద్రం పలు స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ కింద ప్రతి ఏటా రూ.6 వేలుని కేంద్రం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ డబ్బులు పడతాయి.

12 విడత డబ్బులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో పడ్డాయి. 13వ విడత డబ్బులు ఇప్పుడు పడాల్సి వుంది. అయితే ఈ డబ్బులు మరో నెల రోజుల్లో రైతులకు పెట్టుబడి సాయం కింద పడనున్నాయి. ప్రతీ ఏటా కూడా ఈ డబ్బులు మూడు విడతల్లో రైతుల అకౌంట్ లో పడతాయి.

ఏప్రిల్-జులై నెలల మధ్య మొదటి విడత పడతాయి. రెండో విడత ఆగస్టు-నవంబర్ మధ్య పడతాయి. అదే మూడో విడత అయితే డిసెంబర్ నుంచి తర్వాతి ఏడాది మార్చి 31 లోగా పడతాయి. 13వ విడత రైతుల ఖాతాల్లో ఈసారి మార్చి 8 హోలీ పండగలోగా వేస్తారని తెలుస్తోంది.

ఈ స్కీమ్ కి అర్హులు ఎవరు..?

సాగు చేస్తున్న భూమి కలిగిన రైతులు ఈ స్కీమ్ కింద బెనిఫిట్స్ పొందొచ్చు.
ఈ రైతులకి ప్రతి ఏటా రూ.6 వేలు సాయం అందిస్తారు.
రాజ్యాంగ పదవుల్లో ఉన్న రైతులు, అధికారులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజినీర్లు మరియు లాయర్లు అర్హులు కాదు.
ఇన్‌స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్ కూడా అర్హులు కారు.

ఈ స్కీమ్ లో ఎలా చేరాలి..?

ఈ స్కీమ్ లో చేరాలంటే రైతులు ఇకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి.
సమీపంలోని రైతు భరోసా కేంద్రం లేదా సచివాలయ వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి ఇందులో చేరవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version