ఏపీలో ప్రతిపక్ష పార్టీల దూకుడు పెరుగుతుంది..నిదానంగా ప్రతిపక్ష టిడిపి బలం పెరుగుతుంది..ఆ పార్టీకి జనధారణ పెరుగుతున్నట్లే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చంద్రబాబు పర్యటనలకు జనం పెద్ద ఎత్తున రావడం..అటు లోకేష్ పాదయాత్ర చేయడం టిడిపికి ప్లస్ అవుతుంది. అదే సమయంలో జనసేనతో పొత్తుకు టిడిపి రెడీ అవుతుంది. అటు పవన్ సైతం జగన్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. అలాగే టీడీపీతో కలవడానికి పవన్ సిద్ధమవుతున్నారు.
ఇటు వైసీపీలో ఆధిపత్య పోరు పెరుగుతుంది..కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది..అలాగే జగన్ ఇమేజ్ సైతం కాస్త డౌన్ అవుతుందనే సర్వేల్లో తేలుతుంది. ఇటు సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు. ఈ పరిస్తితుల్లో వైసీపీకి రిస్క్ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఈ పరిస్తితుల నుంచి పార్టీని బయటపడేయడానికి జగన్ కొత్త టార్గెట్‌తో ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ప్రతిపక్షాలకు చెక్ పెట్టి మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సారి అధికారంలోకి వస్తే మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండవచ్చు అనేది జగన్ కాన్సెప్ట్.. అందుకే వై నాట్ 175 టార్గెట్ తో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. అయినా ఆ టార్గెట్ రీచ్ అవ్వడం జరగని పని ..ఆ విషయం జగన్‌కు కూడా తెలుసు. కానీ ఆ టార్గెట్ పెట్టుకుని ముందుకెళితేనే..నేతలు ఎఫెక్టివ్ గా పని చేసి పార్టీ గెలుపుకు కృషి చేస్తారనేది జగన్ ఉద్దేశం.
ఇప్పటికే ఎమ్మెల్యేలని గడపగడపకు తిప్పుతున్న విషయం తెలిసిందే. ఇటు జగన్ బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు. కానీ ఇవేమీ సరిపోయేలా లేవు..ఏదో భారీ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్ళిన ఉపయోగం ఉండటం లేదు. ఎమ్మెల్యేలు తిరిగిన ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు లేరు. పైగా ఇటు ప్రతిపక్షాలు ప్రజల్లోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఇకపై ప్రజల్లో ఉండటానికి పల్లెనిద్ర పేరిట ముందుకెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
విశాఖలో పారిశ్రామిక సదస్సు..ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు..అలాగే విశాఖ నుంచి పాలన మొదలుపెట్టాక..జగన్ పల్లె పల్లెకు వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే స్వయంగా జగన్ జనాల్లో తిరిగితేనే వైసీపీకి మైలేజ్ పెరిగేలా ఉంది. అందుకే ఈ జగన్ ఈ కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.