అవును శబరిమల వెళ్లాలనుకునే వారికి కేరళ ప్రభుత్వం శుభవార్త అందించింది. లాక్ డౌన్ కారణంగా 7 నెలలపాటు మూసివేసిన అయ్యప్ప ఆలయం మండల పూజల కోసం కొద్ది రోజుల క్రితం తెరిచిన విషయం తెలిసిందే. తాజాగా శబరిమల తీర్థయాత్ర కు అనుమతి ఇచ్చినా సరే ఈసారి భక్తుల దర్శనానికి సంబంధించి కఠిన నిబంధనలు విధించింది దేవస్థానం. అయితే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కారణంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శబరిమల అయ్యప్ప ఆలయంలో అనుమతించే భక్తుల సంఖ్య విషయంలో కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
అదేంటంటే శబరిమలకి వచ్చే భక్తుల సంఖ్య పెంచాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు. ముందు తీసుకున్న నిర్ణయాల ప్రకరం ప్రస్తుతం ఒక రోజుకు 1000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్న దేవస్థానం ఇక నుంచి 2000 వరకు భక్తులను అనుమతించనుందని అంటున్నారు. ఇక శని, ఆదివారాలలో 2000 మందిని ఇప్పుడు అనుమతిస్తుండగా ఆ సంఖ్య 3000 వరకు పెంచినట్లుగా తెలుస్తుంది. అయితే ఎంత మంది భక్తుల సంఖ్య పెంచుతారు అనే వివరాలు తెలియజేస్తూ నేడు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాక్షం ఉందని అంటున్నారు.