విద్యార్థులకి గుడ్ న్యూస్.. ఒంటిపూట బడుల షెడ్యూల్ వచ్చేసింది..!

-

ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రం లో ఒంటి పూట బడుల షెడ్యూల్ ని విడుదల చేసింది స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాలు ఈ మేరకు జారీ చేశారు. మార్చి 15 నుండి అకాడమీ క్లియర్ ముగిసే దాకా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్ కి ఒంటిపూట బడులని నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు.

ఈ రోజుల్లో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని విద్యా శాఖ చెప్పింది. ఎక్కడైతే పదవ తరగతి పరీక్ష సెంటర్లు కొనసాగుతాయో ఆ స్కూల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం ఐదు వరకు క్లాసులు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version