ఆస్ట్రేలియా జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ శనివారం.. తన పదవికి రాజీనామా చేశాడు. గత మూడు సంవత్సరాలుగా ఆస్ట్రేలియా జట్టుకు కోచ్ గా పనిచేస్తున్నారు జస్టిన్ లాంగర్. అయితే.. జస్టిన్ లాంగర్… కోచ్ పదవీ కాలం… వచ్చే జూన్ నెలతో ముగిసి పోనుంది. కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల… జస్టిన్ లాంగర్… తన పదవికి రాజీనామా చేశారు.
ఆస్ట్రేలియా బోర్డు సభ్యులు ఎంత చెప్పినా.. జస్టిన్ లాంగర్ మాత్రం రాజీనామాకే సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే తన పదవికి రాజీనామా చేశారు జస్టిన్ లాంగర్. ఇక ఈ రాజీనామాను ఆసీస్ క్రికెట్ బోర్డు కూడా ఆమోదించింది. జస్టిన్ లాంగర్ స్థానంలో… ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ను తాత్కలిక కోచ్ గా నియమించింది బోర్డు. ఫిబ్రవరి 11 నుండి 5-మ్యాచ్‌ల T20I సిరీస్‌లో ఆస్ట్రేలియా శ్రీలంకతో తలపడుతుంది. మార్చిలో పాకిస్తాన్ లో ఆసీస్ జట్టు పర్యటించనుంది. ఈ అన్ని మ్యాచ్ లకు ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కోచ్ గా వ్యవహరించనున్నారు. జూన్ లో ఆసీస్ జట్టుకు కొత్త కోచ్ రానున్నారు.