గుడ్‌న్యూస్: గోధుమల ఎగుమతులపై కేంద్రం గ్రీన్ సిగ్నల్

-

గోధుమల ఎగుమతులపై కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల13వ తేదీన గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా గోధుమ ధరలు పెరగడం.. వాటిని కట్టడి చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఈ నిషేధ ప్రక్రియ అమలులోకి రానంత వరకు కస్టమ్స్ అథారిటీ నమోదు చేసుకున్న గోధుమ సరుకులను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. కస్టమ్స్ పరీక్షల కోసం అప్పగించిన గోధుమలను మే13వ తేదీలోపు రిజర్వ్ చేయబడి ఉంటే.. ఈ సరుకులను ఎగుమతి చేయడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది.

wheat-seeds

దీంతోపాటు ఈజిప్టు దేశానికి ఎగుమతి చేసే గోధుమలను కూడా పంపేలా కేంద్రం నిర్ణయించింది. దేశ ఆహారభద్రతను కాపాడుతూనే.. పొరుగు దేశాలు, బలహీన దేశాల అవసరాలకు గోధుమలు ఎగుమతి చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) పేర్కొంది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఆ దేశాలకు కూడా గోధుమలు ఎగుమతి చేస్తున్నట్లు డీజీఎఫ్‌టీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version