ప్రపంచంలో అత్యంత పొడవైన ముక్కు ఉన్న వ్యక్తి…గిన్నిస్‌ బుక్‌లో రికార్డు..!

-

ఒక మనిషిని చూడగానే..మనకు ముందు వారిలో కనిపించేవి కళ్లు, ముక్కు, హెయిర్ స్టైల్..చాలామంది వీటితోనే ఎదుటివారని ఇష్టపడుతుంటారు. అరే ఆమె కళ్లుంటాయ్ రా అంటూ..కొందరూ ప్రేమలో పడుతుంటారు. ఇంకొంతమంది అమ్మాయిలు అయితే..అబ్బాయిల హెయిర్ స్టైల్ కి ఫిదా అవుతారు. అయితే..ముక్కు కాస్త పెద్దగా ఉంటేనే..మన కంట్లో పడుతుంది. అయితే..ముక్కు పొడవుగా ఉంటే..కోపం ఎక్కువని కొందరు, మంచిదని మరికొందరు అంటుంటారు. మాములుగా మనిషి ముక్కు పొడవు అంటే..ఉండేదానికంటే కాస్త ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ముక్కు మాములూ పొడవుగా లేదు. గిన్నీస్ బుక్ రికార్డు వచ్చిదంటే ఆ ముక్కు ఎంత పొడవుంటుందో మీరే ఆలోచించండి..!

ప్రపంచంలో అతి పొడవైన వ్యక్తులు ఉన్నట్లుగానే అతి పొడవు ముక్కున్న వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి టర్కీలో ఉన్నాడు. తన పేరు మెహ్మెట్‌ ఓజియురెక్‌. ఇతనికి పొడవైన ముక్కుతో.. గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించాడు. ప్రపంచంలో ఇతని ముక్కు చాలా పొడవు ఉందని, అందుకే ఇతని పేరు గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేశామని గిన్నిస్‌బుక్‌ రికార్డ్స్ తన‌ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇతని ముక్క పొడవు 8.8 సెం.మీ (3.46 అంగుళాలు).

2010లో ఇటలీలో జరిగిన ఓ టీవీ షోలో అతని గురించి తెలుసుకుని..ఇంత పొడవైన ముక్కున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి ఆయన పేరును గిన్నిస్‌బుక్‌లో చేర్చినట్లు సైట్ లో పేర్కొన్నారు.

మెహ్మెట్‌ ఓజియురెక్‌ ఏం అంటున్నారంటే..

తన ముక్కు పొడవు ఉండటం వల్ల చాలా సంతోషంగా ఉన్నానని…తన ముక్కు పొడవు ఉండటం వల్ల గిన్నిస్‌బుక్‌లో రికార్డు అవటం తనకు ఎంతో నచ్చిందని..ఎక్కడికెళ్లినా తన ముక్కు గురించే మాట్లాడుకుంటున్నారని మెహ్మట్ తెలిపారు..తన ముక్కును చూసి ఎంతో మంది గుర్తిస్తున్నారని అందుకు తనకేంతో గర్వంగా ఉందని అంటున్నారు.

ఈ ముక్కు చూశాక వామ్మో అనుకుంటున్నారా.. ఒజియురెక్ కంటే పొడవైన ముక్కు కలిగిన వ్యక్తి 1770లో ఉండేవారు. ఆయన ఇంగ్లీష్ సర్కస్ స్టార్. పేరు థామస్ వెడ్డెర్స్ . ఆయన ముక్కు ఏకంగా 19 సెంటీమీటర్లు ఉండేది. ఈ విషయాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారే చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version